Saturday, 20 December 2014

tel story." production controller". read, understand and entertain the soul with different economic values. 'ప్రొడక్షన్ కంట్రోలర్'-భట్ సాధన

tel story." production controller". read, understand and entertain the soul  with different economic values. 'ప్రొడక్షన్ కంట్రోలర్'-భట్ సాధన








'ఉత్పత్తి కారకాలు యేవి?'-
'భూమి, శ్రమ, మూలధనం, నిర్వాహణ.'
'వినియోగం అనగా నీకేమి తెలియును?'
'........'
పరీక్షలు అనుకుంటా;మాస్టారి సంతానం చదువుకుంటున్నారు.రోజూ సాయంత్రం నాకు ఆ పిల్లలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయి ఆరు నెలలు దాటింది.పిల్లలు చదువుతున్న యెకనామిక్స్ ఫండమెంటల్స్ జవాబులు విని, మా ఆఫీసులో బాతాఖానీ గుర్తుకువచ్చింది.
"వస్తూత్పత్తి అంతా వినియోగదారుడి వాడకం, యింకా సంతృప్తి కోసమే జరుగుతోంది..."-అంటే నాకు దేనితో నవ్వాలో తోచటంలేదు.-అన్నారు పెక్స్-యెన్సీ గారు.
"యేం జరిగింది యేమిటి? మీ మరదలి పెళ్ళి పనులు యెంతవరకూ వచ్చాయ్?!"-కళ్ళు తిప్పుకుంటూ అన్నారు టైపిస్టు మంగతాయారు గారు.
"అదే పెళ్ళి సరంజామా కోసమే బజారు పోయి, అటు నుంచి అటు ఫంక్షన్ హాల్ మాట్లాడి వస్తున్నా, బిఫోర్ నూన్ అవర్సు పర్మిట్ పెట్టి;"
"సెలవులు మరీ యెక్కువగా వాడుకోరు మీరు యెంచక్కా."
"అవును -నేను ఫ్రెష్షు గా ఒక గిన్నీసు బుక్ కొనుక్కొని, దాన్లో నా పేరు కూడా చెక్కుకున్నా మేడమ్ దీని గురించే..."
"అది సరే మీరు యెకనామిక్సు డాక్టరేటు కదా; అస్సలు ప్రొడక్షను కన్ స్యూమరు కోసమే కాదంటారా ఏమిటి, కొంపదీసి!"-అన్నాను నేను. సంభాషణని పనికొచ్చేదిశగా   మెటీరియలైజ్ చేద్దామని...
"డాక్టరేటు అయితే మటుకూ,  ఆ యా విషయాల మీద పరిశీలన చేసి, పట్టా పొందాక కూడా వాటిపై అనుమానాలు రావడం, అవి తగినంత కలవరపెట్టడం, తన వ్యక్తిగత అభిప్రాయాలని మాత్రమే పైకి చెప్పకుండా మౌనంగా, రహాస్యంగా మార్చుకోవడం జరగదంటారా?!"- అన్నారు పెక్స్ యెన్సీ గారు గంభీరంగా.
"వెనకటికి ఒక శాస్త్రవేత్తని -'మీకు ఫస్ట్ డాక్టరేటు యే సబ్జక్ట్ మీదవచ్చిందీ-అంటే-నాకైతే గుర్తు లేదు, మా సబార్టినేటుని అడగండీ... ' -అన్నాట్ట అల్లాగుందీ ఇది."-అన్నాను నేను.                                      "ఆ సబార్టినేటు జవాబేమిటో?!"-కొత్త యూడీసీ  తన డౌటున్నర వ్యక్తం చేశాడు.
"యేమో నాకు మటుకూ యేం గుర్తూ, బహుశా సైకాలజీలో మెమోరీ గురించి అనుకుంటా...-అన్నాట్ట."
"ఇంతకీ మీ మరదలి పెళ్ళి పనులు గురించి చెప్పడం, పూర్తి చేశారు కాదు."-మంగ తాయారు గారు తిరిగి అడగడంతో:
"ఆ ఆ అక్కడికే వస్తున్నా, అదే పంక్షన్ హాల్ వాడు యిరవైనాలుగు గంటలకు మించి ఒక్క నిమిషం కూడా ఇవ్వనంటాడు. సరే వొప్పుకున్నాను.అన్ని వస్తువులు తీసుకోవడం అయ్యింది. రాబోయేది నడి వేసవి కదా-
అని కుండలు బేరమడుదామని వెళ్ళాను.
"యీ రెండొందల కుండలు ఆల్ రెడీ బుక్ అయిపోయాయి సార్.మీకొసం కొత్తగా తయారు చేయించాలి సార్."-అన్నడు కుమ్మరివాడు.-యెవరయ్యా బుక్ చేసిందీ అంటే-"సినిమా స్టూడియో వాళ్ళు మాట్లాడుకున్నారు సార్."అతని మాటల్లో గర్వం కూడా కనపడింది.
"కొన్నింటికి రంగులేసి, డాన్స్ కి వాడుతారు. ఇన్నెందుకయ్యా"-అంటే-
'స్టంట్ సీన్ షూటింగు కండీ'-అక్కడే ఉన్న స్టుడియో మనిషి అన్నాడు, కుండలతనికి డబ్బిస్తూ; చాలా విసురుగా, విలాసంగా  తన మోటర్ స్టార్ట్ చేసి, వెళ్ళిపోయాడు.
"ఓహో! యెవరండీ వారు?"-ఆసక్తిగా అడిగాను.
"ప్రొడక్షన్ కంట్రోలర్"-అదీ ఆన్సరు.
"ఐ సీ-అదేం న్యాయం బాబూ?!"
"సినిమాలు లేకపొతే యెల్లా సార్!"అన్నాడు ఆ కుండలని వాన్ మీదికి యెక్కిస్తూ సర్దిస్తూ ఉన్న మనిషి.
"మరి భగీరధ ప్రయత్నలు యెమీ చేయలేదా?"-మళ్ళీ  అసలు టాపిక్ పెళ్ళి ప్రయత్నాలు గుర్తొచ్చి;
"ఆ తర్వాత నీళ్ళ కోసం మునిసిపల్ వాటర్ వర్క్స్ కి పెద్ద రికమండేషన్ తో వెళ్ళాను.-'టాంకరులన్నీ స్టూడియోలకి తోలేశాం, యెల్లుండి ఓసారి మళ్ళీ కలవండి'-అన్నాడు అక్కడి ఆఫీసరు."
"లవ్ సాంగ్సు, మళ్ళీ బురద లో స్టంట్ సీన్సు షూటింగ్సు కి పంపెశారన్నమాట యీ నీళ్ళ టాంకరులన్నీ..."-అన్నాను వుక్రోషంగా..
"కూరల బజారుకి వెళ్ళలేదా?!"-మంగతయారు గారు తన లంచ్ బాక్సు బాగ్ లోకి సర్దేస్తూ...
"అక్కడే మన యెకనామిక్సు ఫిలాసఫీ మార్పులకి గురైయ్యింది"-అన్నారు శ్రి పెక్స్ యెన్సీ...
"అక్కడేం యెదురైయ్యింది?!"-నా సబ్జెక్టు యాంగ్జైటీ నాదీ.
"కూరల బజారు మొత్తం యెవరూ లేరు.వాటి ఉత్పత్తిదార్లు సరే, అటు వర్తకులూ, వినియోగదార్లూ యెమైయ్యారైయ్యా అంటే, -










"కూరల మర్కెట్ అంతా సినిమా స్టూడియోలకి వెళ్ళిపోయింది సార్."-అన్నాడు ఒక కుంటి బిచ్చగాడు నా వెర్రీ మొహం చూసి.
కింద పడ్డ కూరగాయల అవశేషాలని 'అచ్చోసినవో,కావో"-గానీ 'ఆమంబాపతు'-ఆంబోతులు తింటున్నాయి ప్రశాంతంగా...
'యెందుకని?'- అని అడగలేదు; అది కూడా స్టంట్ సీను షూటింగ్ కోసమేనని అర్ధం చేసుకొని.
"అవును యిప్పుడు సినిమాలన్నిటిలోనూ :సూపర్ బజార్లో స్టంట్లూ, కూరల మార్కెట్లో స్టంట్లూ, అదెదో సినిమాలో బోలెడన్ని టీవీలూ,మెడికల్ షాపులు పగలేసుకుంటారు. మనం చూడట్లేదా డ్యూయెట్లూ, లవ్ సాంగ్సులో కూడా బాంబులు పెలుస్తున్నారు.






ఒక్కో టటా సూమో గాల్లోకి యెగిరి,  మూడు సార్లు కింద పడుతోంది మరి."నాకు చిన్నప్పటినించీ ఒక అనుమానం: 'ప్రొడక్షన్ కంట్రోలర్- 'యీ సినిమాలల్లో యేంచేస్తాడా'-అని.ఈనాటికి అర్ధం అయ్యింది. సెన్సు కూడా రివిజన్ అవుతూ వుంటుంది;మనం కానిస్తే..."
"కుండలు, కూరలూ, నీళ్ళూ...యేవైనా సరే... వీటిలో వినియోగదారుల జీవితావసరాల  కోసం యెంతవరకూ వుత్పత్తి అవుతున్నాయీ?!,వినియోగింపబడుతున్నాయీ?!, సంతృప్తి నిస్తున్నయీ?!, చెప్పండీ..."అన్నారు చాలా మటుకూ అవెశంతో పెక్స్ యెన్సీ గారు.
నాకైతే ప్రొడక్షన్ కంట్రోలర్, 'ఉత్పత్తి పెంచండీ..' అని ప్రొత్సహించే మహాత్ములూ, 'ధరలు తగ్గించండీ, నిత్య జీవితవసరాలు అందరికీ అందనీయండీ'-అనే నిస్వార్ధ వుద్యమదారులూ...అంతా గుర్తుకొచ్చారు. అయినాకానీ...
"ఆ కూరగయలనీ, కుండలనీ,నీళ్ళనీ...అన్నిటినీ....సినిమాల ద్వారా అనుభవించే వారు: పాపం సగటు సినీ ప్రేక్షకులేకదా..."అనేశాను.
అల్లా అన్నానే కానీ, నా లాజిక్ కి నేనే నాలిక కరుచుకున్నాను. అందుకే ననుకుంటా:  వేదాంతులు మూర్ఖూడి కేసి చూసినట్లు చూశారంతా.
...మాస్టారి పాపాయి ఉమ నన్ను భుజాలు కుదుపుతూ యిహ లోకం లోకి తీసుకొచ్చింది.
"అంకుల్, మురళీ రెడ్ కాయిన్ కొట్టాడు;సపోర్టుగా ఫాలో ఆన్ కాయిన్ ఇంకోటి కొట్టాలి కదూ, చూడండీ, నన్ను అడేశేయమంటున్నాడు..."
"అవును మురళీ, నువ్వు ఫాలో ఆన్ కొట్టాలిసిందే..."
-అన్నాను నేను
@@@. 

.tel.chain story."Gollaadaa..." by m.chuudaamani "గొల్లాడా...."గొలుసు కధ by యం.చూడామణి,

.tel.chain story."Gollaadaa..." by m.chuudaamani "గొల్లాడా...."గొలుసు కధ byయం.చూడామణి
ఒక రోజు నానీ ఈగ లేదూ, అది తన ఇల్లు కడుగుకుంటూ   కడుగుకుంటూ  తమాషా గా తన సొంత పేరుని మర్చిపోయిం దిట.ఇంకేం ఉందీ,యెంక్వయిరీ చేసుకుంటూ బయలుదేరిందిట.మొదట గొల్లవాడి దెగ్గిరికి వెళ్లి ఇల్లా అడిగిందిట.

"గొల్లాడా నాపేరు ఏమిటో నీకు తెలిస్తే కాస్త చెబుదూ." దానికి ఆ గొల్ల వాడి సమాధానం ఇల్లాగుందీ...
"నాకేం తెలుసూ,అయినా నాచేతిలో ఉన్న గొడ్డలిని అడిగి చూడూ"

ఆ నానీ ఈగకి గొలుసు లాగా సాగిపోయే పాటలంటే. మహా ఇష్టం .అందుకనే ఇల్లా పాడుకుంటూ తన సందేహం తీర్చుకోవ డానికి ప్రయత్నించింది.
"గొల్లాడా,గొల్లాడి చేతిలో గొడ్డలీ...నాపేరేమిటీ?"


"నాకేం తెలుసు,పోనీ నేను నరికే కొమ్మలనడుగూ..."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,నాపేరేమిటీ?"













"మాకేం తెలుసు,మామీద వాలే ఆ చిలకలనడుగు."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,నాపేరేమిటీ?
"మాకేం తెలుసు,మా చిలకలని పెంచే రాజ కుమారీ ని అడుగు." 







"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,

ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలని పెంచే రాజకుమారీ నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నన్ను అల్లారుముద్దుగా చూసుకునే మానాన్న  మహారాజూ గారిని అడుగు."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలని పెంచే రాజకుమారీ, ఆ రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజా నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నేనెక్కి తిరిగే గుర్రాన్ని అడుగు."

"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలని పెంచే రాజకుమారీ, ఆ రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం  నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నా కడుపులో పెరుగుతున్న బుడ్డి బుడ్డి పిల్లలని అడుగు."

"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికే కొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలని పెంచే రాజకుమారీ, ఆ రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం,  ఆ గుర్రం కడుపులో బుడ్డి బుడ్డి పిల్లలూ నాపేరేమిటీ?!"
ఇంతకీ చివరాఖరికి ఆ గుర్రం పిల్లలు ఎమన్నాయంటే...









"నీపేరు నీకే తెలియదా ?,మర్చిపోయావా?నీపేరు ఈ ఈ ఈ హీ హీ గా......" అని సకిలించాయిట ఆ పిల్లగుర్రాలు.ఒకే!   
  @@@