Friday 1 August 2014

" somtha duupu" a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy 24.'సొంత డూపు' -కధానిక-సాధనభట్

" somtha duupu" a comedy interview-by sadhana bhat, just for fun, read and enjoy
24.'సొంత డూపు-కధానిక-సాధనభట్

"ఇందు గల డందు లేడని
సందేహము వలదు...."
మావాడికేసి నిటారుగాచూసి,
"ఓయ్! ఇది పోతన గారి పద్యం రా!"-అన్నాను.
"ఆవ్,నేనే పేరుతో రాసా"-
వదిలేస్తాననుకున్నాడు;
"అబ్బే,ఆయన చాలాకాలం క్రితం వాడురా!"
"ఐతేనేం నేను ఆయన అంశతోటి పుట్టినవాడిని- నాకు పూర్వజన్మ సువాసనలున్నాయి, నీకు లేవు."

"సరే! కంపుల సంగతి వదిలేయ్,ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామో తెలుసా నీకు?"
"లేదు, ఎక్కడికి? సినిమాకా!?"-ఉత్సహంగా అన్నాడు.
"కాదు, సినిమా యక్టరు ఇంటికి."-
తూలి పడబోయాడు,అడ్డుకున్నాను.
"!నిజమా,యెందుకు  యెలా వచ్చింది ఛాన్సు?"
"అది అంతే,ఇంటర్వ్యూ అప్పాయింట్మెంట్ బుక్ చేశాను-యేడాది కిందటే."
"నీ ఋణం జన్మలొ తీర్చుకోలేను."
"ఫర్వాలేదు, బైకు ఆపు.నెస్ట్ హౌసే..."హీరోగారి ఇల్లు చేరాము.
బోయ్ ఉన్నడు-గేటు దగ్గర. లోపలికి విజిటింగ్ కార్డ్ పంపాను.పిలుపు వచ్చింది.వెళ్ళాం.
మంచి సౌకర్యలతొ,విలాసవంతంగా ఉంది ఇల్లు, రూము.మిగితా ఇల్లు చూసినా, అస్సలు ఇళ్ళే చూడని వాళ్ళల్లా,వర్ణించడం యేమీ బాగోదు,అదోటీ-అల్లా వర్ణించడం సభ్యత గాదని మన సొంత ఇది.యేమంటారు!?
ఆయన -హీరోగారు వచ్చేశారు.లేచి నుంచుని, నమస్తే పెట్టాం.సెల్ తో కాకుండా,టేప్ రెకార్డరు ఆన్ చేశాను.








"నమస్తే,నమస్తే...కూర్చోండీ.మీరూ...!?"-మర్యాదగా నసిగారు.
"మా సిన మా పత్రిక-విలేఖరిని నేను,వీడు మా..."
అనుకోకుండా మావాడి పరిచయానికి ఆయన అడ్డు పడ్డారు.
"అభిమానులు దేవుళ్ళైతే- మీరు దేవదూతలు.కానీయండి మీ ఇంటర్వ్యూ."
ఇక లలిత కళల గురించి, ఆయన అభిరుచుల గురించీ,సినీ రాజకీయాల గురించీ ఏవేవో
'చొప్ప దంటు ప్రశ్నలు'-నేను వేస్తే- వాటికి తగ్గ 'ఊక దంపుడు సమాధానాలు'-ఆయన ఇస్తున్నారు.
మాటల సందర్భంలో: మన హీరో గారు:
"నాటకానుభవమేకాదు,జీవితానుభవం కూడా ఆట్టే లేదు;చదువూ అంతంత మాత్రం.అంతా, అన్నీ కలిసి నన్ను సూపరు హీరొగా చేశేశారు.అంతే!"
" మధ్యన మీ చిత్రాలు ఒకటి,రెండేళ్ళు బాగా తగ్గి పోయాయి.రకరకాలుగా వార్తలు వచ్చాయి. మీదృష్టిలో అసలు కారణం యేమిటంటారు?-"ఆసక్తిగా అడిగాను.
"అబ్బే యేంలేదు,మొదటి బెస్టుయాక్టరు అవార్డు వచ్చినపుడు నటుడిగా నా భాధ్యతలు పెరిగాయనిపించింది. మూడులో నేనుండగా: ఒక నిర్మాత,వారి దర్శకుడు నా దగ్గరికి వచ్చారు.నన్ను వాళ్ళ చిత్రంలో బుక్ చేస్తామన్నారు."
"..."
"నేను కర్మకాలిపోయి,-యీ చిత్ర కధ యేమిటి?,నా పాత్ర స్వభావం యేమిటి?-అని అడిగాను."
"..."
"అంతే,నన్ను వెర్రి వాణ్ణి చూసినట్లు చూసి,వెళ్ళి పోయారు. ఇండస్ట్రీలో నాకు పిచ్చివాడిననీ...,తెలివి తక్కూ వెధవననీ... పేరు వచ్చేసింది.దాంతో నా రెండేళ్ల కెరీర్ దెబ్బ తింది."- మోస్తరు ఆవేశంతో అన్నాడు.








ఇంతలో ఒక అరడజను మంది వచ్చి, అదే గదిలో కూర్చున్నారు.హీరోగారిని సైలెంట్ గా విష్ చేసి,  కొందరైతే యేవో కాగితాలలో తలదూర్చుకోని ఉన్నారు.కొందరు 'రికామీ' గా మా సంభాషణ -ప్రతి స్పందన బయటపెట్టుకోకుండా వింటున్నారు.టిఫిన్లూ,టీలూ వచ్చాయి.ఇంకో ముగ్గురు వొచ్చారు అదే గదిలోకి.
నేనింక ధన్యవాదాలు చెప్పుకొని,లేచి బయటపడదాం అనుకున్నాను.మావాడు బద్దకంగా ఆవలించబోయి,దానిని చిన్న దగ్గుగా మార్చి, మర్యాద ప్రకటించాడు.లేవబోతూ నేనన్నాను.
"ఈక్కడ ఆశీనులైన వారెవరండీ?మాకు పరిచయం చేస్తే బాగుంటుంది;అదీ మీకభ్యంతరం లేకపోతే..."
"అబ్బే! విత్ ప్లెజర్..."
 ఆయన ఒక్కొక్కరినీ చూపుతూ వివరించారు.
"వీరు గతంలో మాంచి నాటక రచయిత:ఇప్పుడు నా పి.యే గా ఉంటున్నారు."
అందరికీ కలిపి ఒక్కేసారి పెడదామనుకొని, నా వందనాలు 'ప్రొక్రాస్టునేటు' ఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టాను.


ఆయన కొనసాగించారు.
"వీరు మా దూరపుబంధువు:నా పర్సనల్ మేకప్ మాన్ వీరే;వీరు నా ప్లేబాక్ సింగరు;వీరేమో నాకు డబ్బింగ్ వాయిస్ యిచ్చే శాస్త్రి గారు,గొప్ప యాక్టరు కూడా;..."
నేను అడ్డు తగులుతూ,ఉండబట్టలేక అడిగేశాను మరి:
" చిన్న డౌటు... మీ వాయిస్ కుడా బానే ఉంది కదండీ,మీకు డబ్బింగ్ యెందుకంటారూ?!"


"అబ్బే యేంలేదు,-నేను నటిస్తున్న చిత్రాల సంఖ్య పెరిగేటప్పటికి,రీరికార్డింగ్స్ కి నాకు డేట్స్ సరిపోక శాస్త్రి గారిని యెంగేజ్ చేశారు- దర్శకుడు. తర్వాత నా సొంత గొంతుతో రిలీజ్ ఐన రెండు చిత్రాలు ఫ్లాప్...కావడంతో ,తక్కిన దర్శకులందరూ : శాస్త్రి గారినే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వాడుతూవస్తున్నారు."  
పాపం హీరో గారు తీరిగ్గా అల్లా వివరిస్తూంటే...
"నేను పోతా,నన్ను దయచేయనీ..."-అని యెల్లా అడగటం...అని తటపటాయిస్తున్నాను.
హీరోగారు కొనసాగించటం మానలేదు పాపం.
"అది సరే,వీరిని కలవండీ,నా సినిమాలల్లో డాన్సులలో నాకు బదులుగా డూపుగా నటిస్తారు-





మిస్టర్ నటరాజ్-పదేళ్ల క్రితం గొప్ప డాన్సు డైరెక్టర్; ఈమధ్యనే కరాటే నేర్చుకొని,'కొరియోగ్రాఫరు' గా డాన్సులలో వైవిధ్యం సృష్టిస్తూన్నారు;"
ఇంకొకరిని చూపిస్తూ...
"వీరు నా సినిమాలలో శృంగార దృశ్యాలలో నా బదులుగా నటిస్తారు".
నాకు ఒక్కేసారి ఆశ్చర్యానందాలు 99.9% యెందుకో కలిగినమాట నిజం మరి.
ఆయన ఇంకా చెబుతూనె ఉన్నారు.
"వీరేమొ కరుణ,శాంతి రసాత్మక దృశ్యాల్లో నాకు డూప్-అన్నమాట;వీరేమో వీర,భయానక,భీభత్స,రౌద్ర రసాత్మక దృశ్యాల్లో నాకు బదులుగా నటిస్తూ ఒక్కక్కసారి ప్రాణాలనుకూడా లెక్క చేయకుండా నటిస్తారు.అప్పుడప్పుడూ పెద్ద పెద్ద ప్రమాదాలనుకూడా యెదుర్కుంటారు".




వాళ్ళంతా నాకు డ్రగ్స్ యెడిక్ట్స్ లాగా కనిపించారు.అన్నట్లు వారి యెదురుగా ఉన్న బల్లలపై రకరకాల మందులు,ఇంజెక్షన్ సిరంజీలు ఉన్నాయి మరి.


"ఇకపోతే వీరు మంచి హాస్యప్రియులు:నా చిత్రాల్లో హాస్య,అద్భుత రస దృశ్యాలలో నాకు డూప్ గా సహకరిస్తూంటారు."
నేను సీరియస్ గా నవ్వేసుకున్నాను.పక్కనే మావాడు నిద్రనాపుకోలేక తూలుతున్నాడు.నేను లేచాను. నవరసాల డూపులందరికీ నమస్కరించాను.

"నవరస డూపుభ్యోంనమః-
చాలా సంతోషం సార్, మీనించి ఇంకా మంచి చిత్రాలు రావాలనీ,మీరు కేంద్ర,రాష్ట్ర అవార్డులు అనేకం పొందాలనీ ఆశిస్తూ-సెలవు తీసుకుంటున్నాను.ఇంకవెళ్ళివస్తాము సార్."-
అంటూనే మావాడిని తట్టి లేపాను.బయలుదేరాము.హీరోగారు గేటు దాకా సాగనంపుతూ:













'వెళ్ళిరండి,మంచిది-మరలా యెప్పుడైనా కలుద్దాం. అన్నట్లు ఇలా మీతో ఇంత దూరం శ్రమ తీసుకొచ్చిన వీరిని (అంటే మావాడిని) పరిచయం చేయలేదు. మొదట్లో మీరు పరిచయం చేయబొతుంటే నేనే పొరపాటున అడ్డం వచ్చినట్టున్నాను.క్షమించండీ..."
ఇంకా యేదో అనబోయేంతలో నేను వారిస్తూ:
" వీడా, యేం ఫర్వాలేదు, అంతగా చెప్పుకోతగ్గ వాడు యేమీ కాదు లేండీ..."
అన్నాను.మావాడు కూడా యేమీ చిన్నబుచ్చుకొనే పరిస్థితిలో లేడు.వాడికి బయటికి యెప్పుడు వెళ్ళిపోదామా; బయటికెళ్ళి యెప్పుడు పళ్ళు తోముకుందామా, నాలిక గీసుకుని,గెడ్డం గీసుకుని సబ్బుతో స్నానం చేశేద్దామా అన్నట్లుంది
"మీ బ్రదరా!?"
"కాదు"
"మీ ఫ్రెండా?!"
"కాదు, వీడు నా డూపు, నా 'సొంత డూపు'-అన్నమాట:
"అదేమిటీ?!?!..."
ఆశ్చర్య పోయారు హీరో గారు;నేను తేల్చక తప్పలేదు:
"నేను మీలాంటి మహానటులకు అభిమాన సగటు ప్రేక్షకుడిని కదా: నాకు బదులుగా నేను చూడాల్సిన మీ చిత్రాలన్నీ వీడే ఓపిగ్గా చూశేస్తూ ఉంటాడు: అదీ సంగతీ: దట్సాల్".










                         


            @@@.

No comments:

Post a Comment