Saturday 20 December 2014

.tel.chain story."Gollaadaa..." by m.chuudaamani "గొల్లాడా...."గొలుసు కధ by యం.చూడామణి,

.tel.chain story."Gollaadaa..." by m.chuudaamani "గొల్లాడా...."గొలుసు కధ byయం.చూడామణి
ఒక రోజు నానీ ఈగ లేదూ, అది తన ఇల్లు కడుగుకుంటూ   కడుగుకుంటూ  తమాషా గా తన సొంత పేరుని మర్చిపోయిం దిట.ఇంకేం ఉందీ,యెంక్వయిరీ చేసుకుంటూ బయలుదేరిందిట.మొదట గొల్లవాడి దెగ్గిరికి వెళ్లి ఇల్లా అడిగిందిట.

"గొల్లాడా నాపేరు ఏమిటో నీకు తెలిస్తే కాస్త చెబుదూ." దానికి గొల్ల వాడి సమాధానం ఇల్లాగుందీ...
"నాకేం తెలుసూ,అయినా నాచేతిలో ఉన్న గొడ్డలిని అడిగి చూడూ"

నానీ ఈగకి గొలుసు లాగా సాగిపోయే పాటలంటే. మహా ఇష్టం .అందుకనే ఇల్లా పాడుకుంటూ తన సందేహం తీర్చుకోవ డానికి ప్రయత్నించింది.
"గొల్లాడా,గొల్లాడి చేతిలో గొడ్డలీ...నాపేరేమిటీ?"


"నాకేం తెలుసు,పోనీ నేను నరికే కొమ్మలనడుగూ..."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,నాపేరేమిటీ?"













"మాకేం తెలుసు,మామీద వాలే చిలకలనడుగు."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,
కొమ్మలమీద వాలే చిలకలూ,నాపేరేమిటీ?
"మాకేం తెలుసు,మా చిలకలని పెంచే రాజ కుమారీ ని అడుగు." 







"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,

కొమ్మలమీద వాలే చిలకలూ, చిలకలని పెంచే రాజకుమారీ నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నన్ను అల్లారుముద్దుగా చూసుకునే మానాన్న  మహారాజూ గారిని అడుగు."
"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,
కొమ్మలమీద వాలే చిలకలూ, చిలకలని పెంచే రాజకుమారీ, రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజా నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నేనెక్కి తిరిగే గుర్రాన్ని అడుగు."

"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,
కొమ్మలమీద వాలే చిలకలూ, చిలకలని పెంచే రాజకుమారీ, రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం  నా పేరేంటీ?"
"నాకేం తెలుసు,నా కడుపులో పెరుగుతున్న బుడ్డి బుడ్డి పిల్లలని అడుగు."

"గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ, గొడ్డలి నరికే కొమ్మలూ,
కొమ్మలమీద వాలే చిలకలూ, చిలకలని పెంచే రాజకుమారీ, రాజకుమారిని అల్లారుముద్దుగా చూసుకునే మహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం గుర్రం కడుపులో బుడ్డి బుడ్డి పిల్లలూ నాపేరేమిటీ?!"
ఇంతకీ చివరాఖరికి గుర్రం పిల్లలు ఎమన్నాయంటే...









"నీపేరు నీకే తెలియదా ?,మర్చిపోయావా?నీపేరు హీ హీ గా......" అని సకిలించాయిట పిల్లగుర్రాలు.ఒకే!   
  @@@

No comments:

Post a Comment