Saturday 20 December 2014

.tel.poet.story."Ahimsathya Vratham"-Kadhaanikavitha By Bhat Sadhana అహింసత్యవ్రతం.... * కధానికవిత BY భట్ సాధన

FRIDAY, 1 AUGUST 2014

.tel.poet.story."Ahimsathya Vratham"-Kadhaanikavitha By Bhat Sadhana అహింసత్యవ్రతం....
* కధానికవిత BY భట్ సాధన

అమ్మ చెప్పె చిన్నప్పుడు
  గురుతుకోచ్చే ఎల్లప్పుడూ
 " కధ చెప్పూ ,కధ చెప్పూ .."
.అని అనగా అనగా...
 మనసూహాల తేలె   మరి వినగా వినగా...
        @@@
 ఒకా నొకా కొనలోన,
 భగభగ మను ఎండలోన;
 మర్రి చెట్టు నీడ లోన,
ఆకలితో కడుపులోన,
నక్క ఒకటి కూర్చున్నది.
"సత్య మంటే ఏదీ ?
అహింస అంటే ఏమిటీ ?"
అని ఆలోచిస్తూ ఉన్నది.
         @@@


దైవమపుడు కటాక్షింపగ
వచ్చెనపుడుపరీక్షించగ
ధరమీదికి దిగివచ్చెను
తోటి జీవ వేషాలను
ధరియించీ కరుణించీ
        @@@

 హడావిడిగ కర్రి ఆవు
పరుగులెత్తే భయపడుచు
నక్క ఎదుటే దాటిపోయె
ప్రాణములను అర చేతను
అదిమదిమీ పట్టుకునీ ఆగకుండ,
ఆయాసమును తాను మరీ వీడకుండ
"రక్షించుము,కరుణించుము"
అని అంటూ వణికిపోతూ
పరిగెడుతూ ప్రార్ధించెను  
చూపులతో అర్ధించెను
అంగలార్చుచుచు,గాండ్రించుచు
పులి ఒకటీ ఆవు వెనుక తరుముకు రాగా
ఆకలినే మరిచె మరి నక్కా
తెల్లబోయె వడివడిగా నెంచక్కా
            @@@








"కర్రి ఆవు ఏదైనా
ఇటు వైపుగ వచ్చిందా?
అటు వైపుగ పోయిందా?
మరియాదగ నిజము చెప్పు
లేదంటే హింసించెద  అటునిటు చూడక
వెనువెంటనె చెప్పూ
ఇటు దటు చేశావో
నీకే మరి ముప్పూ"-అని అంటూ 
మరి యింతగ గాం డ్రించెను- పులి గాడూ
అటునిటు తిరుగుతు తాను-జిత్తులమారీ
                @@@







చెట్టు నీడ దాటి, పులి చెంతకు దూకి వచ్చి-
"హా! ………………..నేనిక్కడ ఉండగా...
ఆవూ రాలేదు వైపునకూ...
ఇక్కడ వెతుకుట దండగ
హింసింపక వడలు నన్ను
బ్రతుకే నీదయ వలన -పండుగ కాగా"
అని బదులివ్వగ-
వెడలిపోయె  వెనుతిరిగీ-
గాండ్రించుచు వెర్రి పులీ
మరలి వచ్చి ,పాల నిచ్చె
కృతజ్ఞ్యతగ కర్రి ఆవు
సత్యా హింసల ఏకబిగిన
పాటించగ నక్క కపుడు
మెచ్చి దైవ మిచ్చె ముక్తి నపుడు.
              @@@







"మన దగ్గర తెలివుంటే
సత్యాహింసల పాటించుట
సులభమనీ అనిపించును కాదా
అదే రీతి నీతి మనకు వినిపించును కాదా"
       @@@
అమ్మ చెప్పె చిన్నప్పుడు
గురుతు కొచ్చె ఎల్లప్పుడు
కధచెప్పూ ,కధ చెప్పూ ...
అని అనగా అనగా...
మనసూహాల తేలెమరి      
  వినగా వినగా...
@@@

No comments:

Post a Comment